HYDERABAD:Delhi Police on Friday sought more time to file an action taken report (ATR) in court on a plea seeking an FIR against AIMIM chief Asaduddin Owaisi in an alleged sedition case. The court had asked the police to file an ATR report on the complaint filed by Brijesh Chand Shukla of Swaraj Janata Party against the MIM) leader
Hyderabadnewsupdate
Friday, 7 October 2016
ATR in Court against AIMIM Chief
HYDERABAD:Delhi Police on Friday sought more time to file an action taken report (ATR) in court on a plea seeking an FIR against AIMIM chief Asaduddin Owaisi in an alleged sedition case. The court had asked the police to file an ATR report on the complaint filed by Brijesh Chand Shukla of Swaraj Janata Party against the MIM) leader
Thursday, 22 September 2016
నిజాం పేటలో పర్యటిస్తున్న కేటీఆర్
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిజాంపేటలో పర్యటిస్తున్నారు. నిజాంపేట భండారి లే అవుట్ ను కూడా ఆయన పరిశీలించారు. వరద నీటిలో చిక్కుకున్న అపార్టుమెంట్ల గురించి ఆరా తీశారు. స్థానికుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతకుముందు, బేగంపేట్ లోని అల్లంతోట బావి, మయూరి మార్గ్ నాలాలను ఆయన పరిశీలించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.
ఏ రోజు ఏ మూడ్ లో ఉన్నానో నా డ్రెస్సులే చెబుతాయి: సన్నీలియోన్
‘ఏ రోజు ఏ మూడ్ లో ఉన్నాననే విషయాన్ని నేను ధరించే డ్రెస్సులే చెప్పేస్తాయి’ అంటోది ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్. సినీ తారలైనంత మాత్రాన బయట కూడా గొప్పగా కనిపించాలా? అని చాలా మంది అనుకుంటూ ఉంటారని.. అలా కనిపిస్తూ, ఫ్యాషన్ దుస్తులు ధరిస్తేనే ప్రజలు గౌరవిస్తారనేది తన అభిప్రాయమని చెప్పింది. సెలబ్రిటీలు మంచి వ్యక్తులా? కాదా? అనే విషయం అనవసరమని, వారు ధరించే డ్రెస్సులను బట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తుంటారని సన్నీలియోన్ చెప్పింది. ఆ విధంగా ఆలోచించడం మానవుడి నైజమని, ఎదుటివారు ధరించే దుస్తులను బట్టే వారి స్థాయిని మనం అంచనా వేస్తుంటామని తెలిపింది. తాను ఫ్యాషన్ దుస్తులు ధరించినప్పుడు తన గురించి ఎవరేమనుకుంటున్నారన్నది తెలుసుకోవడం తనకు ఇష్టమని సన్నీలియోన్ తన మనసులో మాట చెప్పింది.
KCR in Delhi
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కేంద్రమంత్రి దత్తాత్రేయను కలిసి, పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో దత్తాత్రేయ చొరవ చూపాలని ఆయన కోరారు. నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం గురించి ఆయన దత్తన్నకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధులు ఆలస్యం కాకుండా అందాలని అన్నారు. తన పర్యటన సందర్భంగా రామగుండం ఫెర్టిలైజర్స్ ప్లాంట్ పునరుద్ధరణ పనులపై కేంద్రంతో చర్చించి, అందుకోసం సాయం చేయాలని కోరినట్లు చెప్పారు.
శ్రీకాళహస్తిలో సింధు ప్రత్యేక పూజలు
‘రియో’ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు ఈరోజు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం, ఆమె రాహు, కేతు పూజలు నిర్వహించింది. పూజలు ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించింది. సింధుతో పాటు బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన తన తల్లిదండ్రులతో కలిసి సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరుడికి తులాభారం మొక్కు కింద 68 కిలోల బెల్లంను సింధు సమర్పించుకుంది.
వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు... హెలికాప్టర్లను రంగంలోకి దింపనున్న అధికారులు
గుంటూరు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో రహదారులపైకి నీరు వచ్చేసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగులో కొద్ది సేపటి క్రితం ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఈ ఘటన జరిగింది.
బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో కొందరు బస్సుపైకి ఎక్కి కూర్చున్నారు. తమని రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వారిని కాపాడేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. వారికి ఆహారాన్ని కూడా అందించాలని యోచిస్తున్నట్లు కొమ్మాలపాటి శ్రీధర్ మీడియాకు తెలిపారు.

Subscribe to:
Posts (Atom)