Wednesday 10 August 2016

నయీం డైరీలో 63 మంది జర్నలిస్టుల పేర్లు - ఐపీఎస్‌లకు వాటాలు



ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటిలో జరిపిన సోదాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నయీంకు చెందిన డైరీలో ఎవరెవరితో సంబంధం ఉన్నదీ, ఐపీఎస్‌లకు ఏ మేరకు వాటాలు, ముడుపులు ఇచ్చిందీ తదితర వివరాలను పూసగుచ్చినట్టు పేర్కొన్నాడు. అలాగే, నయీంకు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎవరెవరిని అతను టార్గెట్‌ చేశాడు? ఎంతెంత వసూలు చేశాడు? ఈ వివరాలన్నీ ప్రస్తుతం పోలీసుల గుప్పిట్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నెక్నాంపూర్‌ గ్రామం అల్కాపురి కాలనీలోని నయీం ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు కీలక వివరాలతో కూడిన ఓ డైరీ లభ్యమైంది. ఈ డైరీనే ఇపుడు అత్యంత కీలకంగా మారనుంది. కాగా నయీముద్దీన్‌కు సహకరించిన వారిలో పోలీసు బాసులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. నల్లగొండకు చెందిన 63 మంది జర్నలిస్టులకు కానుకలు ఇచ్చినట్లు డైరీలో నయీం రాసుకున్నాడు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. నయీం డెన్‌లో పోలీసులు వందలాది డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నారు. ఇందులో కొంత మంది పోలీసు అధికారులు, రాజకీయ వేత్తలకు సంబంధించిన వివరాలు లభించాయి. దీంతో అటు పోలీసులతో పాటు.. ఇటు జర్నలిస్టుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

No comments:

Post a Comment