Wednesday, 31 August 2016
Wednesday, 10 August 2016
నయీం డైరీలో 63 మంది జర్నలిస్టుల పేర్లు - ఐపీఎస్‌లకు వాటాలు
ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటిలో జరిపిన సోదాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నయీంకు చెందిన డైరీలో ఎవరెవరితో సంబంధం ఉన్నదీ, ఐపీఎస్‌లకు ఏ మేరకు వాటాలు, ముడుపులు ఇచ్చిందీ తదితర వివరాలను పూసగుచ్చినట్టు పేర్కొన్నాడు. అలాగే, నయీంకు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎవరెవరిని అతను టార్గెట్ చేశాడు? ఎంతెంత వసూలు చేశాడు? ఈ వివరాలన్నీ ప్రస్తుతం పోలీసుల గుప్పిట్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నెక్నాంపూర్ గ్రామం అల్కాపురి కాలనీలోని నయీం ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు కీలక వివరాలతో కూడిన ఓ డైరీ లభ్యమైంది. ఈ డైరీనే ఇపుడు అత్యంత కీలకంగా మారనుంది. కాగా నయీముద్దీన్‌కు సహకరించిన వారిలో పోలీసు బాసులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. నల్లగొండకు చెందిన 63 మంది జర్నలిస్టులకు కానుకలు ఇచ్చినట్లు డైరీలో నయీం రాసుకున్నాడు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. నయీం డెన్‌లో పోలీసులు వందలాది డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నారు. ఇందులో కొంత మంది పోలీసు అధికారులు, రాజకీయ వేత్తలకు సంబంధించిన వివరాలు లభించాయి. దీంతో అటు పోలీసులతో పాటు.. ఇటు జర్నలిస్టుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
పారిశ్రామికవేత్త భర్తను వీడి ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లిన వివాహిత
ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పరిచయాలు పలు సందర్భాల్లో మంచి చేస్తుంటే.. పలు సందర్భాల్లో విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. అంతేనా.. పలువురు యువతీయువకులు చాటింగ్‌ల ద్వారా ప్రేమికులుగా మారి ఒక్కటైన సంఘటనలూ ఉన్నాయి. అలాగే, వివాహమైన దంపతులు.. తమ ఫేస్‌బుక్ ప్రియురాళ్లు/ప్రియుడి కోసం తమ భర్త/భార్యలను వదిలివేసి వెళ్లిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
25 యేళ్ళ యువతికి యువతికి మూడేళ్ల క్రితం నాసిక్ కు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండ్ లోని లోహఘాట్ కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
గత నెల 10న వివాహిత (25) తన భర్తను వదలి ప్రియుడి దగ్గరకు పారిపోయింది. ఆమె వెళ్తూ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో ప్రేమజంట ఉన్నట్టు గుర్తించారు. నాసిక్ పోలీసులు చంపావత్ వెళ్లి వివాహితను గుర్తించి వెనక్కు తీసుకునివచ్చారు. కానీ ప్రియుడు మాత్రం పరారయ్యాడు.
కత్తెరకు దొరకని 23 ముద్దులు
బాలీవుడ్ కుర్రకారుని హీటెక్కిస్తున్న న్యూమూవీ బేఫికర్. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి రిలీజైన ఓ పోస్టర్ సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రణవీర్‌సింగ్- వాణీ కపూర్ జంటగా రానున్న రొమాంటిక్ ఫిల్మ్ ఇది. దీనికి దోజ్ హు డేర్ టు లవ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్ ఆదిత్యచోప్రా! ఇందులో హీరో- హీరోయిన్ లిప్‌లాక్స్‌పై సోషల్ మీడియాలో ఒకటే చర్చ.
వీళ్లిద్దరు కలిసే ప్రతి సన్నివేశంలోనూ లిప్‌లాక్ సీన్‌ని క్రియేట్ చేశాడట డైరెక్టర్. ఆ లెక్కన సినిమా మొత్తం 23 సార్లు లిప్‌లాక్ లున్నట్లు సమాచారం. ఒకప్పుడు సినిమాల్లో లైట్‌గా కనిపించేది ఇలాంటి సీన్.. ఇప్పుడైతే నటీనటుల లిప్‌లాక్‌తో పోస్టర్స్‌ని విడుదల చేయడం కొసమెరుపు. మొన్నటివరకు నాలుగు రకాల పోస్టర్స్ రాగా, లేటెస్ట్‌గా వచ్చింది ఐదోది. గతంలోకంటే ఈసారి లిప్‌లాక్ డోస్ పెరిగిందని అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు డిసెంబర్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కూడా ఆదిత్య చోప్రానే!
తెలంగాణలో కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్ ప్రారంభం
హదరాబాద్: కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్‌ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. pushkaralu.telangana.gov.in లో పుష్కరాల వివరాలు పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో రవాణా సౌకర్యం, పుష్కర ఘాట్లు, భక్తులు ఎక్కడెక్కడ రద్దీగా ఉన్నారు అనే వివరాలు ఉంటాయిని ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్, నల్గొండ పుష్కరాల ఆప్‌లను మొబైల్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. దీని ద్వారా పుష్కరాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. వెబ్‌సైట్‌లో టూరిజం స్పాట్, పుణ్యక్షేత్రాల వివరాలు పొందుపర్చబోతున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు
Subscribe to:
Posts (Atom)






