నయీం నివాసంలో సోదాలు పూర్తి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం నివాసంలో సోదాలు పూర్తయినట్లు పోలీసులు వెల్లడించారు. పుప్పాలగూడలోని అతడి నివాసంలో రూ.2.08 కోట్లు నగదు, 1.93 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఇళ్లకు సంబంధించిన పలు దస్తావేజులు, నాలుగు పిస్టళ్లు, ఒక డమ్మీ పిస్టల్, 160 రౌండ్ల బుల్లెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. నయీం నివాసంలో మొత్తం 11 మంది నివాసముంటున్నారని తెలిపారు.
No comments:
Post a Comment