ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పరిచయాలు పలు సందర్భాల్లో మంచి చేస్తుంటే.. పలు సందర్భాల్లో విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. అంతేనా.. పలువురు యువతీయువకులు చాటింగ్‌ల ద్వారా ప్రేమికులుగా మారి ఒక్కటైన సంఘటనలూ ఉన్నాయి. అలాగే, వివాహమైన దంపతులు.. తమ ఫేస్‌బుక్ ప్రియురాళ్లు/ప్రియుడి కోసం తమ భర్త/భార్యలను వదిలివేసి వెళ్లిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
25 యేళ్ళ యువతికి యువతికి మూడేళ్ల క్రితం నాసిక్ కు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండ్ లోని లోహఘాట్ కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
గత నెల 10న వివాహిత (25) తన భర్తను వదలి ప్రియుడి దగ్గరకు పారిపోయింది. ఆమె వెళ్తూ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో ప్రేమజంట ఉన్నట్టు గుర్తించారు. నాసిక్ పోలీసులు చంపావత్ వెళ్లి వివాహితను గుర్తించి వెనక్కు తీసుకునివచ్చారు. కానీ ప్రియుడు మాత్రం పరారయ్యాడు.
No comments:
Post a Comment