హైదరాబాద్: ఈ నెల 10వ తేదీన 2 వేల కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రహదారుల వెంట మొక్కలు నాటిలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హరితహారంపై మంత్రి జూపల్లి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పంచాయతీరాజ్ రహదారుల వెంట మొక్కలు నాటాలన్నారు. వారం.. పది రోజుల్లోనే లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఆశాజనకంగా లేదన్న మంత్రి దాన్ని అధిగమించాలన్నారు. వీలైన చోట్ల పుష్కరఘాట్ల వద్ద కూడా మొక్కలు నాటాలని మంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment