Wednesday, 10 August 2016

తెలంగాణలో కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్‌ ప్రారంభం


హదరాబాద్: కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్‌ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. pushkaralu.telangana.gov.in లో పుష్కరాల వివరాలు పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో రవాణా సౌకర్యం, పుష్కర ఘాట్లు, భక్తులు ఎక్కడెక్కడ రద్దీగా ఉన్నారు అనే వివరాలు ఉంటాయిని ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ పుష్కరాల ఆప్‌లను మొబైల్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. దీని ద్వారా పుష్కరాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. వెబ్‌సైట్‌లో టూరిజం స్పాట్‌, పుణ్యక్షేత్రాల వివరాలు పొందుపర్చబోతున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు

No comments:

Post a Comment