Wednesday, 7 September 2016

24 గంటల్లోగా వెబ్‌సైట్లోకి.. ఎఫ్‌ఐఆర్‌లు- SC


దిల్లీ: కేసు నమోదు చేసిన 24 గంటల్లోగా సదరు ఎఫ్‌ఐఆర్‌లను ఆయా వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్‌ శాఖలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఎఫ్‌ఐఆర్‌ను 24 గంటల్లోగా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలంటూ ఇటీవల దిల్లీ హైకోర్టు నగర పోలీసులను ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. భారత యువ లాయర్ల అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం..

దిల్లీ హైకోర్టు ఆదేశాలను అంగీకరిస్తూనే, కొన్ని మార్పులు చేసింది.

అన్ని రాష్ట్రాల పోలీస్‌ అధికారులు 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. తొలుత 48 గంటల సమయం ఇవ్వాలని భావించినప్పటికీ.. 24 గంటల పరిమితినిస్తూ తీర్పు చెప్పింది. ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో మాత్రం 72 గంటల్లోగా అప్‌లోడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. కాగా.. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల లాంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ను అప్‌లోడ్‌ చేయడంలో మినహాయింపు కల్పించింది.

No comments:

Post a Comment