Wednesday, 7 September 2016

కాంగ్రెస్‌కి ఓటేస్తే క్యాన్సర్‌కు ఉచిత చికిత్స - అమరీందర్‌ సింగ్‌



ఫరీద్‌కోట్‌: కాంగ్రెస్‌కి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్ర ప్రజలకు క్యాన్సర్‌ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తామని పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. కొట్కపుర నియోజకవర్గంలో నిర్వహించిన 'హల్కే విచ్‌ కెప్టెన్‌'(నియోజకవర్గంలో కెప్టెన్‌) కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు ప్రజలతో మాట్లాడారు. క్యాన్సర్‌ బారిన పడినవారికి సరైన చికిత్స చేయించలేని స్థితిలో ఉన్న పేదలు ఆత్మీయులను కోల్పోతున్నారన్నారు. అందుకే తాము అధికారంలోకి వస్తే క్యాన్సర్‌ రోగులకు ఉచిత వైద్యం అందజేస్తామని తెలిపారు.

No comments:

Post a Comment