అడ్డగుట్ట: సికింద్రాబాద్‌లోని రైలు నిలయం సమీపంలో బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పుట్‌పాత్‌పై ఉన్న చెరకు బండి, టీ స్టాల్‌ను ఢీకొట్టింది. ఎస్సై సామ్యానాయక్ కథనం ప్రకారం సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుంచి తార్నాక-ఉప్పల్ వైపు వెళ్తున్న హ్యుందాయ్ ఐ-20 కారు అధిక వేగంతో ప్రయాణిస్తూ రైల్యే నిలయం సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై వున్న టీ స్టాల్, చెరుకురసం బండి, పాన్ డబ్బాలను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టడంతో ఆగింది. ఈ ప్రమాదం తెల్లవారు జామున జరగడం, జనసమ్మర్థం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
No comments:
Post a Comment