Wednesday 7 September 2016

ఒబేసిటీ’ని ఓడిద్దాం



మీరు అధిక బరువు.. అదే ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారా? ఆందోళన చెందకండి. ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ శరీర బరువును తగ్గించుకోగలుగుతారు. కేవలం వారం రోజుల వ్యవధిలో మీరు 5 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గుతారు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే, ఒక వారం రోజులు తర్వాత ఈ డైట్ ను మళ్ళీ మొదలుపెట్టవచ్చు. ఇలా మీరు మొత్తం బరువు తగ్గేవరకు కొనసాగించవచ్చు.
మొదటి రోజు
మీ డైట్ ప్లాన్ లో భాగంగా మొదటిరోజున కేవలం పండ్లు మాత్రమే తినాలి. అన్ని రకాల పండ్లు తినవచ్చు.. ఒక్క అరటిపండు తప్ప. అయితే ఎక్కువగా పుచ్చకాయ ముక్కలు తినడం వలన ఎక్కువ బరువు తగ్గుతారు. వీటితోపాటుగా రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి.
రెండో రోజు
ఈ రోజంతా కేవలం కూరగాయలే మీ ఆహారం. అన్ని రకాల కూరగాయలు తినవచ్చు. పచ్చివి తినగలిగితే తినండి, లేదంటే ఉడికించుకుని అయినా తినొచ్చు. అయితే బంగాళదుంప మాత్రం రోజులొ ఒక్కసారి మాత్రమే తినాలి. ఆది కూడా ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో మాత్రమే. 2 చిన్న బంగాళదుంపలు మాత్రమే ఉడకబెట్టుకుని తినాలి. అలాగే రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగండి.

మూడో రోజు
ఇక మూడోరోజు మీరు అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినవచ్చు. అయితే ఈ రోజంతా బంగాళదుంప మరియు అరటి పండు మాత్రం తినకూడదు. ఇవి తప్ప ఏవైనా తినొచ్చు. వీటితోపాటు 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి.
నాలుగో రోజు
ఈ రోజు 4 పెద్దవి లేక 6 చిన్న అరటి పండ్లు తినొచ్చు. వాటితొ పాటుగా 500 ml (అర లీటర్) పాలు కూడా తాగాలి. అంతేకాదు, ఈరోజు మొదలుకుని మీరు రోజుకి రెండుసార్లు క్యాబేజీ సూప్ తాగాలి
అయిదో రోజు

మీరు కనక శాకాహారులైతే.. ఈరోజు బ్రౌన్ రైస్ మరియు 6 టొమాటోలు తినవలసి ఉంటుంది. ఒకవేళ మీకు బ్రౌన్ రైస్ దొరక్కపోతే, దానిబదులు పనీర్ తినొచ్చు. ఇక రోజు మధ్యలో ఆకలి వేసినపుడు క్యాబేజీ సూప్ తాగాలి. ఒకవేళ మీరు మాంసాహారులయితే అర కేజి బోన్ లెస్ చికెన్ లేదా మేక మాంసం లేదా చేపను తినాలి. దీంతోపాటు 6 టొమాటోలు తినాలి. అంతగా ఆకలి వేస్తే క్యాబేజీ సూప్ ఉండనే ఉందిగా.. ఈ సూప్ ఎంతైనా తాగొచ్చు.
ఆరో రోజు 

ఆరో రోజున శాకాహారులు బ్రౌన్ రైస్ మరియు కూరగాయలు తినొచ్చు. టొమాటోలుగాని బంగాళదుంపగాని తినకూడదు. ఆకలి వేసినప్పుడు క్యాబేజీ సూప్ తాగుతూ ఉండాలి. మాంసాహారులయితే.. అర కేజి బోన్ లెస్ చికెన్ లేదా మేక మాంసం లేదా చేపను తినాలి. కుదిరితే చికెన్ సూప్ చేసుకుని తాగొచ్చు. కూరగాయలుతో చేసిన సలాడ్ మాత్రం తప్పనిసరిగా తినాలి. మరీ ఆకలి వేస్తే క్యాబేజీ సూప్ తాగొచ్చు.
ఏడో రోజు
ఈరోజు మీరు బ్రౌన్ రైస్ తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది. మొలకెత్తిన పెసలు మరియు నచ్చిన కూరగాయలు బ్రౌన్ రైస్ లో వేసుకుని వెజ్ బిర్యానీలా చేసుకుని తినాలి. దీంతోపాటు మీకు ఇష్టమైన పండ్ల రసాలు తాగండి. ఆకలి వేసినపుడు క్యాబేజీ సూప్ తాగాలి.
ఇవి గుర్తుంచుకోండి..
ఈ వారం రోజులు రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలి. మద్యపానం జోలికి పోకూడదు. అలాగే చిరుతిండ్లు మరియు నూనె అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. కుదిరితే రోజుకి కనీసం ఒక అరగంట వ్యాయామం చేయాలి. రోజూ క్యాబేజీ సూప్ మాత్రం తప్పకుండా తాగాలి.
మీరు కనుక ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ రకమైన ఆహారం తీసుకుంటే కనీసం 5 నుంచి 7 కేజీల బరువు తగ్గుతారు. ఒకవేళ ఇంకా బరువు తగ్గాలనుకుంటే ఈ డైట్ ను మళ్ళీ మొదలెట్టండి.. 

No comments:

Post a Comment