Saturday 10 September 2016

'కాటమరాయుడి' విమర్శలు తిప్పి కొట్టే యోచనలో కేంద్రం.!


ప్రముఖ నటుడు, జనసేన అధినేత పార్టీ స్థాపించిన నాటి నుంచి పెద్దగా సభలు, ప్రెస్‌మీట్లు నిర్వహించింది చాలా తక్కువే.. అయితే ఈ గత నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించడం.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు పవన్. కాకినాడ సభలో అయితే ఏకంగా ప్రధాని మోదీ, వెంకయ్య పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ సర్కార్ రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చి సరిపెట్టుకుందంటూ పవన్ ఆగ్రహంగా మాట్లాడిన విషయం తెలిసిందే.! ఇక వెంకయ్య నాయుడి గురించి మాట్లాడుతూ మాననీయ వెంకయ్య జీ.. అని మొదలుకుని ప్రసంగాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు పవన్.

అయితే తాజాగా వెంకయ్య నాయుడు స్పందిస్తూ నేను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నేను ప్రజలకే జవాబుదారి.. వారికి మాత్రమే సమాధానం చెబుతానంటూ క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన నన్ను కొందరు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు..

అది పద్ధతి కాదంటూ కౌంటరిచ్చారు. కాగా శనివారం ఏపీకి చెందిన బీజేపీ నేతలంతా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్యాకేజీ ఇచ్చిన తరువాత జనాలు ఏమనుకుంటున్నారు.. అసలు పరిస్థితేంటి అని ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఆ సమావేశంలో పవన్ ప్రస్తావన వచ్చినట్లుగా సమాచారం.? అస్తమాను సభలు పెట్టి బీజేపీని విమర్శిస్తుండటంతో మోదీ, బీజేపీ పెద్దలు పవన్ విమర్శలను తిప్పి కొట్టాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.? ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్య ద్వారా పవన్‌కు కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.? పైగా వెంకయ్యే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టనున్నారు.

దీంతో కేంద్రం పవన్ విమర్శలను తిప్పి కొట్టేందుకు సిద్ధమైంది అనే వార్తకు మరింత బలం చేకూరుతోంది. మరి వెంకయ్య పవన్ పై ఏం ప్రశ్నలు సంధించనున్నారు.. అసలు పవన్ ఎలాంటి కౌంటర్లు, పంచ్‌లు పేల్చాలాని ఇప్పటికే పుల్ పిల్‌గా స్క్రిఫ్ట్‌ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.!.

No comments:

Post a Comment